నువ్వు దేవుణ్ణి నమ్మడం కాదు,నీ పిల్లలకి ఆ నమ్మకాన్నివ్వు.|
నువ్వు భక్తిగా ఉండడం కాదు, నీ పిల్లలకు భక్తీ నేర్పు.|
నువ్వు వ్రతాలు చేయ్యడం కాదు, నీ కూతురుకి అలవాటు చెయ్యి.|
నువ్వు పాటలు పాడడం కాదు,నీ కూతురికి ఒక్క పాటైనా నేర్పు.|
నీ వంశం ఉద్ధరింపబడలంటే నీ పిల్లలు వృద్ధిలోకి రావాలి.|
తల్లి తండ్రులు పిల్లలకి చిన్నప్పుడు చెప్పినదే వారికి జీవితాంతం ఉంటుంది.|
ఇంటి సంస్కృతినీ సంప్రదాయాన్ని కపడాల్సినది పిల్లలే.|
పిల్లల్ని ప్రేమించడం అంటే వారికీ ఏ కష్టం రాకుండా మంచి చెడు చెప్పకుండా పెంచడం కాదు.|
పిల్లలకు చిన్నప్పుడే రామాయణం, మహాభారతం, భాగవతం చెప్పు.|
ఎలా బ్రతకాలొ, ఎలా బ్రతకకూడదో, చెప్పినట్టు బ్రతికినప్పుడు ఏమి వొస్తుందో వారికీ తెలుస్తుంది.|
వాళ్ళను పాడు చేసి నువ్వు ఎంత పెద్ద పండితుడివైనా ప్రయోజనం శూన్యం.|
–నడిచే దేవుడు,కంచి మహాస్వామి జగద్గురు శ్రీ చంద్రశేకరేంద్ర సరస్వతి స్వామిజీ
